
పేకాట స్థావరంపై పోలీసుల ఎటాక్ పట్టుబడ్డ నిందితులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
అశ్వారావుపేట మండలంలోని నారవారిగూడెం కాలనీ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు వారిపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.నారవారిగూడెం కాలనీ సమీపంలోని ఒక తోటలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసినట్లు ఎస్సై యాయాతిరాజు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు జూదరులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 3,100 నగదు,ఒక ఆటో, రెండు బైకులు, రెండు మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నాం అన్నారు.
