TEJA NEWS

హెచ్.సి.యు విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జి అమానవీయం… మెతుకు ఆనంద్

ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్.సి.యూ విద్యార్థులు మరియు ప్రొఫెసర్లను గవర్నమెంట్ అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా వారిపై లాటిచార్జి చేయడం అత్యంత హేయమైన చర్య.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి , ప్రభుత్వ భూములను అమ్మ వద్దని చిలుక పలుకులు పలికి, ఇప్పుడు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు & కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పూనుకోవటం దుర్మార్గం.

కెసిఆర్ హయాంలో గ్రీన్ కవరేజ్ పెరిగి, ప్రపంచంలోనే హైదరాబాద్ పట్టణం గ్రీన్ సిటీగా గుర్తింపు పొందింది.

కెసిఆర్ గవర్నమెంట్ లో హరితహారం జరిగితే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో హరిత సంహారం జరుగుతుంది.

రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక, గ్రీన్ కవరేజ్ తగ్గడం & భూగర్భ జలాలు తగ్గడం చూస్తూ ఉంటే, భావితరాలకు సహజ సంపదను దూరం చేయడమే అనిపిస్తుంది.

కొన్ని దేశాలలో కలుషితమైన వాతావరణంతో ఇప్పటికే ఆక్సిజన్ క్లబ్బులు ఏర్పడటం మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి పరిస్థితి మన దేశంలో, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆడ రాక పాత గజ్జలు అన్నట్లు పరిపాలన చేతగాక, చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు, ఈ విధమైన చర్యలు చేయడం దారుణం.

మన హైదరాబాద్ పట్టణము మోస్ట్ లివబుల్ సిటీ గా గుర్తింపు పొందింది. దాన్ని అలాగే కొనసాగించే బాధ్యత మనందరి పైన ఉంది.

ఇప్పటికైనా ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడం అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా తరపున డిమాండ్ చేస్తున్నాము.