Spread the love

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు.

★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 74 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదుల కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

★ నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన అవనిగడ్డ శిరీష మరియు ఆమె తల్లి డ్వాక్రా సంఘం లో సభ్యులుగా ఉన్నట్లు, ఆ గ్రూపు లోని లీడర్లు అయిన రామలక్ష్మి మరియు త్రివేణి డ్వాక్రా గ్రూపు లోను 20 లక్షలు కొరకు ఫిర్యాదు చేత మరియు ఆమె తల్లి చేత సంతకాలు చేయించుకుని తీసుకున్నట్లు, ఈ విషయం గురించి వారిని అడుగగా మీకు రావలసిన లోను మేము ఇవ్వము, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బూతులు తిట్టినట్లు, SBI బజారు బ్రాంచ్ మేనేజర్ అయిన K. రమేష్ బాబు వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కావున ఫిర్యాదు కి మరియు ఫిర్యాది తల్లికి తెలియకుండా మోసం చేసి లోన్ ఇచ్చిన బ్యాంకు మేనేజర్ మీద మరియు డ్వాక్రా గ్రూపు లీడర్ల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.

★ పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామస్తుడు అయిన భోగిరెడ్డి వెంకటరెడ్డి 2019వ సంవత్సరంలో పిడుగురాళ్లలోని లెనిన్ నగర్ కు చెందిన కందరపు నాగ శైలజ అను ఆమెను కులాంతర వివాహం చేసుకున్నట్లు, వివాహం అనంతరం వారికి ఇద్దరు మగ పిల్లలు సంతానం కలిగినట్లు, పిడుగురాళ్ల లెనిన్ నగర్ కు చెందిన పొట్టూరి కళ్యాణ్ అను అతను ఫిర్యాదు భార్యకు మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని ది.01/02/2025 వ తేదీన ఫిర్యాది భార్యను మరియు వారి చిన్న బాబును తీసుకువెళ్లినట్లు, వెళుతూ వెళుతూ ఫిర్యాదు బైక్ మరియు బైక్ లో ఉన్న పుస్తకాలు, ఇంట్లో నుండి సుమారు 90,000/- డబ్బులు, 5 శవర్ల బంగారం తీసుకుని వెళ్ళినందుకుగాను తనకు తగిన న్యాయం చేయవలసిందిగా వచ్చి ఎస్పీ కి అర్జీ ఇవ్వడం జరిగింది.

★ గురజాల మండలం పల్లెగుంత గ్రామానికి చెందిన పేరుపోగు సాగర్ మరియు బండారుపల్లి వెంకటేశ్వర్లు గత ఐదు సంవత్సరాల నుండి పొలంలో కూలీలను మరియు సరుకులను తోలే విషయం లో అతని ఎరువుల కొట్టులో ఎరువులు అప్పుగా తీసుకొని ఇవ్వడం ద్వారా పరిచయం ఏర్పడినట్లు, అయితే కూలీల డబ్బులు లెక్క విషయంలో ఫిర్యాదుకి మరియు బండారుపల్లి వెంకటేశ్వర్లు తగాదాలు రావడం వలన సదరు బండారుపల్లి వెంకటేశ్వర్లు కోపంతో కక్ష పెంచుకొని నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి, కులం పేరుతో దూషించి కొట్టగా తల మీద మరియు ఎడమ కంటి పైన రక్త గాయాలు అయినట్లు అంతట కటికల రాజు పేరుపోగు ఏసుదాసు అడ్డు వచ్చి బతిమిలాడి అక్కడి నుండి ఫిర్యాదును పంపగా గురజాల ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స చేయించుకున్నట్లు కావున సదరు బండారుపల్లి వెంకటేశ్వర్లు ను పిలిపించి ఫిర్యాదుకి ప్రాణ రక్షణ కల్పించవలసిందిగా వచ్చి ఎస్పీ కి అర్జీ ఇవ్వటం జరిగింది

★ సత్తెనపల్లి మండలం వడ్డేపల్లి కు చెందిన కడియాల నీలిమ దేవి 2018 వ సంవత్సరంలో కడియాల హరికృష్ణ అను అతనితో వివాహం అయినట్లు, వివాహం జరిగిన ఆరు నెలల నుండి ఫిర్యాదు భర్త మద్యం తాగి ఇంటికి రాకుండా ఉంటున్నట్లు, 2008వ సంవత్సరంలో ఫిర్యాదు తండ్రి చనిపోగా ఆమె తల్లి రెండవ వివాహం చేసుకున్నట్లు, ఆ సమయంలో తన తండ్రి ఫిర్యాదు పేరు మీద కొంత డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా ఫిర్యాదు అత్త మరియు అల్లుడు అయిన తన్నీరు శ్రీనివాస రావు, తన్నీరు రమ్య, నందిగం పృథ్వి, నందిగం అనిత అనువారు హింసించి ఆ డబ్బులు తీసుకొని ఇంకా అదనపు కట్నం కావాలని ఇబ్బందులు పెడుతున్నట్లు, తన భర్త లేని సమయంలో ఫిర్యాదు అత్త కొట్టడంతో గర్భాన్ని కోల్పోయినట్లు కావున సదరు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

★ సత్తెనపల్లి నాగన్నకుంట కు చెందిన రంగిశెట్టి మల్లేశ్వరి అను ఆమె తన మనవడు అయిన ప్రవీణ్ కుమార్ అను అతనికి ఆరోగ్యం సరిగా లేనందువలన చికిత్స నిమిత్తం సత్తెనపల్లి పట్టణానికి చెందిన షేక్ బాజీవలి అను అతని వద్ద ఇంటి స్థలం కాగితాలు పెట్టి నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు, గత మూడు సంవత్సరాల నుండి ఏ నెలకు ఆ నెల వడ్డీ కడుతున్నట్లు, అయినను కూడా బాజీవలి భార్య అయిన షేక్ రోజా ఇంటి వద్దకు వచ్చి ఇల్లు ఖాళీ చేయమని లేకపోతే రౌడీలను పెట్టి కొట్టిస్తాను అని బెదిరిస్తుంది. వారి డబ్బులు వారికి ఇస్తాము అన్నా కూడా డబ్బులు తీసుకోకుండా ఇల్లు ఖాళీ చేయమని ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాది ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

★ మాచర్ల మండలం బెల్లంకొండ వారి పాలెం కు చెందిన పత్తిపాటి చాముండేశ్వరి తండ్రి అయిన పత్తిపాటి చెన్నయ్య ఐదు సంవత్సరాల క్రితం ఫిర్యాది అక్కకు వివాహం చేసినట్లు,
ఇప్పుడు ఫిర్యాది తండ్రి వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకొని తనకు పెళ్లి సంబంధాలు వస్తున్నా పెళ్లి చేయకుండా నువ్వు నాకు పుట్టలేదు నేను నీకు పెళ్లి చేయను అని మానసికంగా హింసిస్తున్నట్లు దానికి గాను ఫిర్యాదు ఎస్పీ ని కలిసి తనకు తగిన న్యాయం చేయవలసిందిగా అర్జీ ఇవ్వడం జరిగింది.

★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు మరియు దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కొరకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినారు.