
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న ప్రసాద్ హాస్పిటల్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన ఎండోస్కోపీ డిపార్ట్మెంట్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రసాద్ హాస్పిటల్ వారు సామాన్య ప్రజలకు కూడా అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని ధ్రుడ నిశ్చయంతో, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఎండోస్కోపీ విభాగాన్ని ప్రారంభించడం జరిగింది అని, హైదర్ నగర్ డివిజన్ ప్రజలు మరియు దగ్గరలో ఉన్న ప్రజానీకం ఈ సౌకర్యాలను సద్వినియోగ పరుచుకోవాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాద్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ ప్రత్యూష్ చౌదరి గారు, ఎండోస్కోపీ విభాగం డాక్టర్ కపిల్ తదితరులు పాల్గొన్నారు.
