
ప్రసాద్ రావు ను పరామర్శించిన దారపనేని
కనిగిరి నియోజకవర్గం కనిగిరి పట్టణంలోని విశ్రాంత మండల అభివృద్ధి అధికారి, చీమలమర్రి ప్రసాద్ రావు ను కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా దారపనేని ప్రసాద్ రావు తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, కీర్తిశేషులు కనిగిరి మాజీ శాసనసభ్యులు ఇరిగినేని తిరుపతి నాయుడుకు ప్రత్యేక సలహాదారుని గా 15 సంవత్సరాలు విశిష్ట సేవలు అందించారని, 2009 నుండి 2014 వరకు ప్రస్తుత కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కి సలహాదారునిగా సేవలందించారని దారపనేని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులు ప్రసాద్ రావు సతీమణి, కుమారునితో దారపనేని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. షేక్ హజరత్ అలీ, మిరియం సుబ్బరాయుడు, ధనియాల తిరుపతి రావు ప్రసాద్ రావు ను పరామర్శించిన వారిలో ఉన్నారు.
