
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించకుండా, మహిళలపై తనకున్న చులకనభావానికి జగన్ కట్టుబడ్డాడు : ప్రత్తిపాటి.
- ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని ఆయన కుటుంబసభ్యులు కూడా హర్షించరు.
- వేమిరెడ్డి కుటుంబం చేతిలో ఓడిపోయాయనన్న అవమానంతోనే వైసీపీనేత తన అక్కసు వెళ్లగక్కాడు
“ గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా కొందరు వైసీపీనేతల ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాలేదు. స్త్రీలను పూజించే సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన భూమిలో పుట్టామనే విషయం మరిచి అత్యంత హేయంగా మాట్లాడుతున్నారు. సోదరి వరసయ్యే టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీనేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అతని మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. తన ఓటమికి కారణమయ్యారన్న అక్కసుతోనే వేమిరెడ్డి కుటుంబంపై ప్రసన్నకుమార్ రెడ్డికి అసూయ. ఆవుచేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. జగనే తల్లిని, చెల్లిని అవమానించి కక్షతీర్చుకుంటుంటే ఆయన అనుమాయులు మహిళల్ని గౌరవిస్తారా? ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించకుండా, ఆడవాళ్లపై తనకున్న చులకన భావనకు జగన్ కట్టుబడ్టాడు. తన ప్రభుత్వంలో తన పార్టీ వారు మహిళల్ని తూలనాడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండికూడా జగన్ స్పందించలేదు. అమరావతి మహిళల్ని తన సాక్షి ఛానల్ లో అనరాని మాటలన్నప్పుడు ఆయన నోరెత్తలేదు. ఇవన్నీ జగన్ నరనరాల్లో గూడుకుట్టుకున్న మహిళా వ్యతిరేకతకు నిదర్శనాలు కావా? పేరులో ఉన్న ప్రసన్నత.. వైసీపీ నేత ప్రవర్తనలో లేకుండా పోయింది. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని ఆయన కుటుంబంలోని మహిళలు కూడా సహించరు. మహిళల్ని గౌరవించని వారు….వారికి ఏం న్యాయం చేస్తారో, ప్రజలకు ఏం సాయం చేస్తారో అందరూ ఆలోచించుకోవాలి. జగన్ అసమర్థత.. చేతగానితనం.. డబ్బుపిచ్చితో సాగించిన కల్తీమద్యం వ్యాపారం ఎందరో ఆడబిడ్డలకు పసుపు-కుంకుమలు లేకుండా చేసింది. ఆయన పాలనలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు..అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. వైసీపీ ప్రభుత్వం మహిళల ఉసురుపోసుకుంది కాబట్టే.. చిత్తుచిత్తుగా ఓడిపోయి పతనం అంచులకు చేరింది.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.
