TEJA NEWS

అమరావతి పున:ప్రారంభ వేడుకకు వెళ్లే బస్సుల్ని ప్రారంభించిన ప్రత్తిపాటి

  • సభకు వెళ్లే ప్రజలకు ఇబ్బందిలేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించిన ప్రత్తిపాటి

రాజధానిలో నేడు అంగరంగ వైభవంగా జరగనున్న అమరావతి పున: నిర్మాణ పనులు ప్రారంభ వేడుకకు ప్రజల్ని తీసుకెళుతున్న బస్సుల్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల నుంచి సభకు బయలుదేరిన బస్సుల్ని ప్రారంభించిన ప్రత్తిపాటి, సభకు వెళ్లేవారికి ఇబ్బంది లేకుండా బస్సుల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించి, సంతృప్తి వ్యక్తంచేశారు. అమరావతి వెళ్లే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆహారం, తాగునీరు అందించాలని, మార్గమధ్యంలో బాగా నీడ ఉన్న చోట బస్సులు ఆపి విశ్రాంతి తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. బస్సుల్లో వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని, రాజధాని సభను విజయవంతం చేసి, సంతోషంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, సిఐ రమేష్, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, పఠాన్ సమాధ్ ఖాన్, గంగా శ్రీనివాసరావు, మద్దుమాల రవి, గట్టినేని రమేష్, తుబాటి శ్రీహరి, వెంకటేశ్వరరావు, నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.