TEJA NEWS

అత్యాచార ఘటన.. కఠిన చర్యలు తీసుకోండి: ప్రధాని

వారణాసి అత్యాచార ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. నగరంలో ల్యాండ్ కాగానే అధికారులను అడిగి వివరాలు సేకరించారు. పోలీసులు, కలెక్టర్తో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. హోటళ్లు, హుక్కా సెంటర్లుకు తిప్పుతూ అఘాయిత్యం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు.