
అన్ని రాజకీయ పార్టీలు యుద్ధం చెయ్యమంటే, చెయ్యలేని ప్రధాని మోడీ.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి ఎస్ బోస్.
సిపిఐ కుత్బుల్లాపూర్ మండల 4 వ మహాసభ నేడు షాపూర్ నగర్ లోని ఏఐటీయూసీ పొట్లూరి నాగేశ్వర్రావు భవన్ లో మండల్ కార్యదర్శి ఉమా మహేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ మహాసభను బోస్ గారు ప్రారంభోత్సవ ఉపన్యాసం చేస్తూ ఈ దేశం స్వతంత్రం కోసం పోరాటం చేసింది భారత కమ్యూనిస్టు పార్టీనేనని, దేశాభక్తులని చెప్పుకునే ఆర్ ఎస్ ఎస్ ఏనాడూ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదని ఇవ్వాల సిపిఐ పార్టీ గురించి కమ్యూనిజం గురించి మాట్లాడటం తగదని ఈ దేశంలో కమ్యూనిజం రావడం తద్యమని అన్నారు. Bjp వచ్చాక అన్ని పోర్టులను ఆదానికి ఇవ్వడం వల్లే నేడు డ్రగ్స్ విచ్చలవిడిగా దేశంలోకి వస్తున్నాయని,బీజేపీ హిందూ అనే పేరుతో రాజకీయం చేస్తూ ఆ హిందువులనే టాక్స్ ల పేరుతో దోపిడీ చేస్తూ వ్యాపారస్తులకి లాభం చేకూరుస్తున్నాడని,పుల్వమా లాగా పెహల్గం ఉగ్రవదుల దాడిని వాడు కుందాం అనుకుంటే తనకి వ్యతిరేకం అయ్యిందని, బీజేపీ నాయకులు సైనికుల త్యాగాన్ని వక్రీకరిస్తూ అవమానంగా మాట్లాడుతుంటే మోడీ కండించకపోవడం ఆ నాయకులను ప్రోత్సాహించడమేనని, ఈ మధ్యలో దొరికిన గుడాచారులు బీజేపీ,ఆర్ ఎస్ ఎస్ కు సంబందించిన వారే ఉన్నారని, వారిని ద్రోహులని బీజేపీ,ఆర్ ఎస్ ఎస్ వారు ప్రచారం చెయ్యకపోవడం చూస్తుంటే వాళ్ళ సంస్థ లో పనిచేసేవారు దేశాప్రోహులని చెప్పకపోవడం, వాళ్లే దేశాద్రోహులను పెంచుతున్నట్లు అనుకోవాలా అని ప్రశ్నించారు.పెరుగుతున్న ధరలను తగ్గించమని, నిరుద్యాగం గురించి, అవినీతి గురించి మాట్లాడకుండా మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఒకే దేశం ఒకే టాక్స్ అని ప్రచారం చేసిన మోడీ పెట్రోల్ పై కూడా టాక్స్ ను అమలు చెయ్యకపోవడం మోడీ కేవలం నినాదాల వరకే పరిమితం తప్పించి ప్రజలకు సేవ చేయడని,వ్యాపారస్తులకే సేవ చేస్తాడని విమర్శించారు.
మోడీ,బీజేపీ కి 37%ప్రజలు మాత్రమే ఓట్లు వేశారని 63%ప్రజలు వ్యతిరేకంగా వేశారని మెజారిటీ ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేస్తె ప్రధాని అయ్యారని కావున ఎన్నికల విధానంలో కూడా మార్పు రావాలని దానికోసం మనం పనిచెయ్యాలని కోరారు.అందరు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ వల్ల కాదని,తెలంగాణ వచ్చాక అవినీతి మితిమిరి పోయిందని,కబ్జాలు పెరిగిపోయాయని,కార్మికుల పై దాడులు పెరిగాయాన్ని,ఉచితల పై మాట్లాడుతున్నారని,కానీ దోపిడీ చేస్తున్న వారిగురించి మాట్లాడట్లేదని,పని కల్పించకుండా మాట్లాడటం తగదని అన్నారు. ఆధాని అంబానీ లకు 6 లక్షల కోట్లు మాపి చెయ్యడం గురించి మాట్లాడాలని, వ్యాపారస్తుల దోపిడీ పై ప్రచారం చెయ్యాలని అన్నారు. అధికారం లో ఉన్న పార్టీల నాయకులు అధికారులను వాడుకొని పనులు చేయిస్తుంటే మరో పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ అధికారులు జైలుకు పోతున్నారని,కావున అధికారులు నిష్పాక్షపాతంగా వ్యవహరించి సమాజాన్ని కాపాడాలని కోరారు. సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కి మహారాష్ట్ర లో అవుమానం జరిగిందని,బీజేపీ హయాంలో అధికారులకు గౌరవమర్యాదలు లేవని అన్నారు.
సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్ గారు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర మహాసభలు మన ప్రాంతంలోనే జరుగుతున్నాయి కాబట్టి సిపిఐ కార్యకర్తలు కదిలి జయప్రదం చెయ్యాల్సిందిగా కోరారు,సిపిఐ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ మండలంలో లక్షల ఎకరాలు వేలాది మంది ప్రజలకు అనేక బస్తిలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉందని,అనేక కార్మిక సంఘాల్లో వేలాది మందికి సభ్యత్వం ఉన్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక హక్కులను కాపాడటానికి పోరాటం నిర్వహిస్తున్నామని అన్నారు. యువకులు మహిళలు హిందూ అనే పేరుతో రాజకీయాలను దృష్టిలను పెట్టుకొని మోసపోవద్దని ప్రజల కోసం నిత్యం పనిచేసేది కమ్యూనిస్టులేనని కావున కమ్యూనిస్టులను అందరించాలని కోరారు.
ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం,జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, హరినాథ్, మండల కార్యవర్గ సభ్యులు హైమావతి,ప్రవీణ్, శ్రీనివాస్,నర్సయ్య, నర్సింహారెడ్డి,దుర్గయ్య,సాధనంద్,భాస్కర్,కృష్ణ,వెంకటేష్,రాములు,సహదేవరెడ్డి,భాస్కర్,బాబు,సత్యవతి,సాయిలు,రవి,సామెల్,శ్రీనివాస్ చారి, వీరాస్వామి, సుంకరెడ్డి, ఇమామ్,భీమేష్,యూసఫ్,కీర్తి,జంబూ,తదితరులు పాల్గొన్నారు.
