TEJA NEWS

అమరావతిలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

అమరావతి:

కూటమి సర్కార్‌ ప్రతిష్టా త్మకంగా తీసుకున్న రాజధాని అమరావతి రీలాంచ్‌ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.. నేడు ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవు తున్నారు.

మధ్యాహ్నం మూడున్నరకు అమరావతికి చేరుకోనున్న మోడీ.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తా రు. మోడీ సభకు 5 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు కూటమి నేతలు..

ప్రధాని మోడీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భారీగా ఏర్పాట్లుచేసింది. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు.

అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్‌ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని మోడీకి వివరించేందుకు… మెయిన్ డయాస్ వెనకవైపు అమరావతి పెవిలియన్‌ ఏర్పాటు చేశారు.

శాశ్వత హైకోర్టు, సెక్రటేరి యట్, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యే లు, మంత్రులు, ఆలిండి యా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టు లతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థా పనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ప్రధాని మోడీ పర్యటనపై ఏపీ మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల, కొల్లు రవీంద్ర ఏర్పాట్లు, భద్రత, ప్రజలకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు. సభా ప్రాంగాణాన్ని ఇన్‌చార్జ్ డీజీపీ హరీష్ గుప్తా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు.

ప్రధాని మోడీ సభ, అమరా వతి రీ లాంచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు, అధికారులు అందరూ కలిసి సమన్వ యంతో ముందుకు వెళ్తున్న మన్నారు. సుమారు 5 లక్షల మంది మోడీ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు సభకు చేరుకునేలా 11 మార్గాలను సిద్ధం చేశారు.

11 చోట్ల పార్కింగ్‌ ప్రదేశాల ను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాని మోడీ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం పరిధిలో ఎవరైనా డ్రోన్లు, నల్ల బెలూ న్స్ ఎగరేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ హెచ్చరించారు.