
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయం.. జె యస్ డాన్స్ అకాడమీ ఉచిత శిక్షణ శిబిరం
రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి…
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసినటువంటి జెఎస్ డాన్స్ అకాడమీ ని అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాన్ని సందర్శించి. నటరాజస్వామి విగ్రహానికి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎస్ డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు శేఖర్ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. గత 18 సంవత్సరాల నుండి నిరంకుశంగా పనిచేస్తున్న శేఖర్ తెలంగాణ కోసం తన వంతు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాడు అలాగే ఉచితగా డాన్స్ నేర్పించడంపై అది కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకు వికలాంగులకు అనాధ పిల్లలకు ఆర్మీ జవాన్ల పిల్లలకు. ఉచితంగా డాన్స్ అది కూడా దైవ భక్తితో కూడిన అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయం అని కొనియాడారు. డాన్స్ తో పాటు జర్నలిస్టు రంగంలో కూడా తనదైన పాత్ర అద్భుతంగా ఉంది తను ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల కోసమే పని చేస్తూ ఏది చేసినా సోషల్ సర్వీస్ నేరుగా చేయడం ఎప్పటికప్పుడు మాలాంటి వారి సలహా తీసుకొని మంచి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా జెఎస్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు ప్రపంచ డాన్స్ అవార్డు గ్రహీతను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ సుభాష్. తదితరులు పాల్గొన్నారు.
