TEJA NEWS

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాపర్ల లో చేరిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు

సకల సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా ప్రైవేటు పాఠశాలలు ఎందుకని సూచించిన…………………. ఉపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్

వనపర్తి \

  • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాపర్ల లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ అధ్వర్యములో బడి బాట ప్రోగ్రామ్ లో గ్రామంలో ఇoటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ లో 7,8 తరగతులు చదువునా 5గురు విద్యార్థులు మన యాపర్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చెరారు ఈ సందర్భభంగా ప్రధానో పాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వెసే భాద్యత మాది అన్నారు. ఈ పోటి ప్రపంచములో చదువంటే కేవలం బట్టి పట్టించి సమాధానములు వల్లెవేయడం కాదు.ఆటలు, పాటలు, మాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక పరిపక్వత తదితర అన్ని రంగాలలో తర్ఫీదు నివ్వడం ద్వారా మీ పిల్లలు ఆత్మన్యూనత భావానికి లోనూ కాకుండా పరిపూర్ణ శక్తి గా తీర్చి దిద్దబడాలి. పై పై మెరుగులకు బ్రమపడకండి. శోధించి సాధించేలా మీ పిల్లలు ఎదగాలంటే మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలయాపర్ల*నందు మీ పిల్లలను చేర్పించగలరు *పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తే చాలు, మీపిల్లలను తీర్చి దిద్దే బాధ్యత మాదిహామి ఇస్తున్నాంవేలకు వేలు కట్టి ఇప్పుడే మీ ఆర్థిక వనరులను ధ్వంసం చేసుకోకండి. భవిష్యత్ లో మీ పిల్లల విద్యాభివృద్ధి కి వినియోగించగలరు. ఉన్నత చదువులకు పొదుపు చేయండి.
  • ఎప్పుడు, ఎక్కడ ,ఎలా,మీ పిల్లల విద్యాభివృద్ధికి ఖర్చు చేయాలో కాస్త దృష్టి సారించండి. ప్రభుత్వం వారు ప్రభుత్వ బడిలో *. ఉదయం పూట రాగిజావ, మధ్యాహ్నం పౌష్టికాహారం తో భోజనం, తెలుగు, ఇంగ్లీషు మీడియం లలో అనుభవజ్ఞులైన ఉపాద్యాయులచే భోధన, ఎలాంటి ఫీజులు వసూలు చేయము *మీ డబ్బులు మీదగ్గరే ఉంటాయి.మీ పిల్లల భవిష్యత్ మన ప్రభుత్వ బడి యాపర్ల లో లో రూపుదిద్దుకుంటుంది. వివిధ రకాల పోటీలు ఆటలు , సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ,. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఉచితంగా స్నాక్స్ అందిస్తామని. ఉచిత పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్స్. అత్యాధునిక డిజిటల్ ప్యానెల్స్ ద్వారా భోధన. సుదూర ప్రాంతాల విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యం,రవాణా ఛార్జీలు చెల్లింపు. తదితర సౌకర్యాలతో పాటు లోనే సకల సౌకర్యాల సర్కారు బడి మన గ్రామం లో ఉండగా, ఎక్కడో 20,30, కి.మీ సుదూర తీరాలకు ప్రైవేట్ పాఠశాలకు పంపుట ఎందుకు దండగ. దీనికీ తోడుగా మన పాఠశాలలో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ ఏర్పట్టు చేసిన్నాము. స్టూడెంట్స్ లైబ్రరీ లో కథల పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు, చదవడానికి లైబ్రరీ , సైన్స్ ల్యాబ్ ద్వార విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నారు ఒకసారి మన ఊరి స్కూల్ ను సందర్శించండి ఆలోచించి మన గ్రామంలోని స్టూడెంట్స్ ను మన గ్రామంలోని బడిలో చేర్చండి అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొహినొద్దీన్‌ శ్రీధర్‌, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు స్వరాజ్‌జం బాబురెడ్డి తల్లిదండ్రులు పాల్గొన్నారు. *