Spread the love

భారత రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 129 – సూరారం డివిజన్ సాయిబాబా నగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ & బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జై భీమ్ మహాసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాట్లాడుతూ… భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే నేడు స్వతంత్ర భారతావనిలో ప్రతి ఒక్కరూ తమ హక్కులను సాధించుకోగలుగుతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్,TRSMA రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి,
జై భీమ్ మహాసేన రాష్ట్ర అధ్యక్షులు గట్టు అశోక్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, మహాసేన సభ్యులు డాక్టర్ అవిజే జేమ్స్, అమర్ బాబు, ఆర్. సిద్దయ్య, మద్దెల సత్యనారాయణ, ఐలయ్య గౌడ్, జె. బాలరాజ్, దానయ్య, మన్నె సత్తయ్య, బాలస్వామి, యేసు రత్నం, యాదయ్య, బాలస్వామి, రాములు, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.