
గ్రేటర్ వరంగల్ 47 వ డివిజన్, కాజిపేట్
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం –వరంగల్ పశ్చిమ శాసన సభ్యలు నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండ 47వ డివిజన్ లో 13 లక్షల రూపాయలతో ఇంపీరియల్ కాలనీలో సిసి రోడ్డు మరియు పోచమ్మగుడి పైప్ లైన్ కి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన ప్రతి హామీ అమలు చేసే తీరుతామని అన్నారు.
డివిజన్ లోని ప్రతి వార్డులో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ న నిర్మాణం చేపడుతామని అన్నారు.
అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలి.
మంజూరు చేసిన పనులను నిర్నీత సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి సంక్షేమం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపలలో సాగుతుందని అన్నారు
ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందు వెళ్తుందని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి 47 డివిజన్ అధ్యక్షుడు షేక్ అజ్గర్ మాజీ కార్పొరేటర్ గోల్కొండ రాంబాబు మైసరపు సీరిల్ లారెన్స్ ఇప్ప శ్రీకాంత్ తమ్ముడి మానస, పోగుల శ్రీనివాస్, సిలువేరు విజయభాస్కర్, దొంగల కుమారస్వామి, దువ్వ రాజు, గరిగ శివ, బర్ల రాజ్ కుమార్, కొమురవెల్లి రమేష్ , తిరుపతి శ్రీనివాస్, కొమురవెల్లి శ్రీనివాస్, దార్ల రాజ్ కుమార్, బిడారి రాజేందర్, బొబ్బిలి నాగరాజు, శోభన పోయిన బిక్షపతి, బబ్లు భానుచందర్, మాతంగి వెంకటేశ్వర్లు, తమ్ముడి మధు, పసునూరి మనోహర్, తదితరులుపాల్గొన్నారు.
