TEJA NEWS

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వరావుపేట నియోజకవర్గం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం
పూసుగూడెం గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా చల్లా రామకృష్ణ ఇల్లు పూర్తిగా దగ్ధమై ఆస్తి నష్టం వాటిల్లింది షార్ట్‌ సర్క్యూట్‌తో ఈరోజు ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం చుట్టుముట్టాయి. క్షణాల వ్యవధిలో ఇల్లు మొత్తం దగ్ధమైంది. చల్లా రామకృష్ణ కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన చల్లా రామకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జడ్పిటిసి బత్తుల అంజి, తిరుపతి రెడ్డి, పత్తి లాల్, అమర్ సింగ్, మహిళా మండల అధ్యక్షురాలు పద్మ, పాలకుర్తి రవి,అవినాష్ , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.