
అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. 2026, జనవరి 1న దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఉండవల్లి CBN నివాసంలో నేడు జరిగిన ఈ కార్యక్రమంలో ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా, టీసీఎస్ సీటీవో డాక్టర్ హారిక్ విన్, టీసీఎస్ ప్రతినిధులు వి. రాజన్న, సి.వి. శ్రీధర్, ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ తదితరులు పాల్గొన్నారు.
