
కొనుగోలు కేంద్రాల ద్వారా రాగులు
సేకరణ
శ్రీకాకుళం : రైతులు పండించిన రాగుల పంట దిగుబడులను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సంతబొమ్మాలి మండల కేంద్రంలోని రైతు సేవ కేంద్రంలో రాగులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఇతర మండలాల్లో పండించిన రాగులను కొనుగోలు చేస్తామని తెలిపారు. రాగులు క్వింటా మద్దతు ధర రూ. 4, 290 ఉందన్నారు.గోనె సంచులు, రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
