TEJA NEWS

రాజీవ్ యువ వికాస పథకంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట?

హైదరాబాద్:
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల యువత సొంతంగా ఉపాధి పొందేందుకు ఆర్థిక సహాయం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

ఈ పథకం ద్వారా యువత కు వారు కోరుకున్న రంగా ల్లో ఉపాధి పొందేందుకు రాయితీతో కూడిన రుణా లను గరిష్టంగా రూ.4లక్షల వరకు అందించనుంది. దీంతో భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు చేసుకుంటు న్నారు.

రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్ర వ్యాప్తం గా సుమారు రూ.6వేల కోట్లతో దాదాపు 5లక్షల మంది నిరుద్యోగ యువత కు రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఇటీవల బడ్జెట్ లో నిధులనుసైతం కేటాయించింది.

21 నుంచి 60ఏళ్లలోపు వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలలోపు ఉండాలి. అదే పట్టణ ప్రాంతంలో వార్షిక ఆదాయం రూ.2లక్షల లోపు ఉండాలి.

రాజీవ్ యువ వికాసం పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు మరింత మేలుచేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం లబ్ధిదారులు వ్యవసాయ యంత్ర పరికరాలు పొందేందుకు రుణసాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

నిర్ణీత రుణసాయానికి అనువైన యంత్ర పరిక రాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. దీనికి అనుగుణంగా అధికారులు ప్రభుత్వానికి జాబితా పంపించారు.

డ్రోన్లు, చిన్న ట్రాక్టర్లు, రొటోవేటర్లు, ప్యాడిబేలర్లు, కాటన్ ష్రెడ్డర్లు, బూమ్ స్ప్రేయర్, సీడ్-ఫెర్టిలైజర్ డ్రిల్, బండ్ ఫోర్మర్, డిస్క్ హారో, పవర్ వీడర్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ర్పేయర్, ఆటో ఆపరేటెడ్ నాగళ్లు, మల్చింగ్ మెషిన్లు తదితరాలు పంపిణీకి అనువుగా ఉంటాయని వ్యవసాయశాఖ నివేదిక అందించింది.

వ్యవసాయ రంగానికి యంత్ర పరికరాల అవసరం, డిమాండ్ దృష్ట్యా వాటిని రాజీవ్ యువవికా సంలో చేర్చడం జరిగిందని బీసీ కార్పొరేన్ ఎండీ మల్లయ్య బట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే యువత ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు.

ఈ క్రమంలో ఎక్కువ మంది సాగు సమయంలో ఉపయోగించే యంత్ర పరిక రాలకోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.