రామచంద్రా నగర్ గ్రామం నూతన పాలకవర్గం సన్మాన కార్యక్రమం.
చిలుకూరు : చిలుకూరు మండల పరిధిలో
రామచంద్ర నగర్ గ్రామపంచాయతీ భవనం నందు ఉద్యోగ ఉపాధ్యాయ మిత్ర మండలితో నూతనంగా ఎన్నికైన పాలకమండలి సర్పంచ్ పాయిలి నాగరాజు , ఉప సర్పంచ్ దొంగరి కృష్ణకుమారి సోమయ్య మరియు వార్డు సభ్యులను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ పాయిలి నాగరాజు ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రమండలి ఇచ్చిన సూచనలు సలహా మేరకు 6 నెలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రమండలి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
