Spread the love

కన్నుల పండుగ గా రాములోరి కల్యాణం

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం

రాములోరి కి పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ దంపతులు

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ దంపతులు, చంద్రశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో వారి నివాసంలోపునర్వసు నక్షత్రం సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి కుటుంబ సభ్యులతో కలిసి అందచేసి కల్యాణం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ . వారి సతీమణి శ్రీమతి శ్యామల దేవి , కుమారుడు పృథ్వి గాంధీ , కోడలు శ్రీమతి భార్గవి , సురేష్ బాబు , శ్రీమతి అరుణ కుమారి . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , రాగం నాగేందర్ యాదవ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ నార్నె శ్రీనివాసరావు , శ్రీమతి మంజల రఘునాథ్ రెడ్డి , మరియు భక్తులు,నాయకులు ,కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందచేయడం చాలా సంతోషంగా ఉంది అని శ్రీ సీతారాముల వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉంటుంది అని, పునర్వసు నక్షత్రం సందర్భంగా రాములోరి కల్యాణం కనుల పండుగగా, అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.