
రేషన్ కార్డుల దరఖాస్తులను డిజిటల్లైజేషన్ చేయాలని ఆదేశించిన…………………….అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
సాక్షిత వనపర్తి
ప్రజా పాలన, గ్రామ సభల్లో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను డిజిటలైజేశన్ చేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.
కలెక్టరేట్లోనే కాన్ఫరెన్స్ హాల్ నుండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులపై అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తో కలిసి ఎంపీడీవోలు, తహసీల్దారులతో వెబెక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అతి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీవోలు, మునిసిపల్ సిబ్బంది బిజీగా ఉన్నందున ప్రజా పాలన, గ్రామసభల సమయంలో వచ్చిన రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను తహసిల్దార్లకు సమర్పించవలసిందిగా ఆదేశించారు. తహసిల్దార్లు ఈ దరఖాస్తులను తమ అందుబాటులోకి తీసుకొని ఫిబ్రవరి 12వ తేదీ లోపు డేటా ఎంట్రీ చేసి డిజిటైజ్ చేయించాలని ఆదేశించారు. దరఖాస్తులను డేటా ఎంట్రీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని, బయటకు వెళ్లకూడదని నిర్దేశించారు.
సమావేశంలో జడ్పీ సీఈవో యాదయ్య, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
