
రేషన్ కార్డుదారులు అలర్ట్.. ఈ పని చేయకుంటే ఏప్రిల్ నుంచి ఉచిత రేషన్ అందదు!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక పథకాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా బిపిఎల్ కార్డు అవసరం. మీ ఈ-కెవైసి ఇప్పటికే పూర్తయి ఉంటే, ప్రభుత్వం మీకు ఈ పథకం ప్రయోజనాలను అందించడం సులభం అవుతుంది. ఈకేవైసి చేయకపోతే ప్రభుత్వం అందించే రేషన్ ఆగిపోవచ్చు..
రేషన్ కార్డ్ హోల్డర్లకు ఒక ముఖ్యమైన అలర్ట్. మీరు ఇప్పటివరకు eKYC ప్రక్రియను పూర్తి చేయకపోతే 7 రోజుల్లోపు దాన్ని పూర్తి చేయండి. లేకుంటే ఏప్రిల్ నుండి మీకు రేషన్ ప్రయోజనాలు లభించడం ఆగిపోతుంది.
రేషన్ కార్డ్ హోల్డర్ నిర్దేశించిన తేదీలోపు కేవైసీ పూర్తి చేయకపోతే, అటువంటి సభ్యుల పేర్లు రేషన్ కార్డు నుండి తొలగించనున్నారు. ఆ సభ్యులకు ఆహార ధాన్యాల పంపిణీ లేకుండా పోతుంది.
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు eKCY చేయించుకోవడానికి వారి పీడీఎస్ దుకాణం లేదా డీలర్‌ను సంప్రదించవచ్చు.
లబ్ధిదారుడు వేరే రాష్ట్రంలో నివసిస్తుంటే, ఆధార్ సీడింగ్ కోసం అతను తన సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లవలసిన అవసరం లేదు. లబ్ధిదారులు వారు ఉన్న చోట నుండి సమీపంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణానికి వెళ్లి e-POS యంత్రం ద్వారా eKYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం వల్ల అర్హత ఉన్నవారికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. నకిలీ రేషన్ కార్డు ఎవరి పేరు మీదైనా ఉంటే, దానిని తొలగించవచ్చు.
eKYC ప్రక్రియ కింద ప్రతి రేషన్ కార్డు సభ్యుడు తన పేరు, పుట్టిన తేదీ మొదలైన వాటిని తన ఆధార్ డేటాతో సరిపోల్చాలి. నకిలీ కార్డుల ఏరివేతలో భాగంగా దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
