
ప్రజల భవిష్యత్, రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణ బాధ్యతను చంద్రబాబు తన భుజస్కంధాలపై వేసుకున్నారు : మాజీమంత్రి ప్రత్తిపాటి
ఆయన కష్టానికి తగిన చేయూతగా, కూటమి అభ్యర్థి ఆలపాటికి భారీ మెజారిటీ కట్టబెట్టడమే మనందరి బాధ్యత.
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడటంతో మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కూటమిఅభ్యర్థి ఆలపాటికి మద్ధతుగా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పట్టణంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు.. ఇతర సిబ్బందిని కలిసి కూటమి ప్రభుత్వ 8 నెలల పాలనా విజయాలు వివరించి వారి ఓట్లు అడిగారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలన రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో అవసరమని, గత పాలకుల విచ్చలవిడితనం.. విధ్వంసపాలనతో అంధకారంగా మారిన ప్రజల భవిష్యత్ ను, రాష్ట్ర ప్రగతిని పునర్న్మించే బాధ్యతను చంద్రబాబు తన భుజస్కందాలపై వేసుకున్నాడని ప్రత్తిపాటి తెలిపారు. అటువంటి వ్యక్తి కష్టం, శ్రమకు తగిన చేయూత అందించడం రాష్ట్ర పౌరులుగా మన బాధ్యతని మాజీమంత్రి అభిప్రాయపడ్డారు.
కూటమి అభ్యర్థి ఆలపాటికి భారీ మెజారిటీ కట్టబెట్టి ఆ భాద్యతను నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. ఇల్లు అయినా, రాష్ట్రమైనా సరైన వ్యక్తి చేతిలో ఉంటేనే బాగుపడుతుందనే సత్యం ప్రజలకు తెలియంది కాదన్నారు. SPTRKM స్కూల్, సాయి వికాస్, భాష్యం, మోడ్రన్ పబ్లిక్ స్కూల్ మరియు నారాయణ స్కూళ్లకు వెళ్లిన ప్రత్తిపాటి, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు భారీ విజయం కట్టబెట్టాలని పట్టభద్రుల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసేనా ఇంచార్జి తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరిముల్లా, నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, నరసింహారావు మాస్టర్, టీడీపీ, జనసేనా, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
