TEJA NEWS

రెడ్డీస్ భారత్” ఆధ్వర్యంలో అన్నదానం

తిరుపతి: తిరుపతి గంగమ్మ జాతరను పురస్కరించుకొని రెడ్డీస్ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతంలోని హరిణి టవర్స్ దగ్గర పేదలకు అన్నదానం చేశారు. గంగమ్మ తల్లి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం మజ్జిగ, అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా రెడ్డీస్ భారత్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి లు మాట్లాడుతూ అసోసియేషన్ లోని అందరి కార్యవర్గ సభ్యుల సహకారంతో గత 15 సంవత్సరాలుగా గంగమ్మ జాతరను పురస్కరించుకొని భక్తులకు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్లిస్ హోటల్ అధినేత మబ్బు సూర్యనారాయణ రెడ్డి, దుగాండ్ల పురుషోత్తం రెడ్డి, టిడిపి నేత మబ్బు దేవనారాయణ రెడ్డి, బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి ల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారత్ రెడ్డిస్ అసోసియేషన్ మానవసేవే మాధవసేవ నినాదంతో
గంగ జాతరను పురస్కరించుకొని అనేక సంవత్సరాలుగా అన్నదాన, సేవా కార్యక్రమాలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో “రెడ్డిస్ భారత్ అసోసియేషన్” మునీశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, హేమాద్రి రెడ్డి, లీలాకృష్ణారెడ్డి,
పేట మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, దాసమునిరెడ్డి, జయచంద్రారెడ్డి, రెడ్డప్ప రెడ్డి, తంగం మనోహర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీమన్నారాయణ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.