
మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారిక నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యల పై వినతిపత్రం సమర్పించిన ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ సైబరాబాద్-FGCC అసోసియేషన్ సభ్యులు .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ
తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 2001 (TSRA-2001) ప్రకారం నమోదు చేయబడిన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (RWAs) యొక్క చట్టపరమైన స్థితిని సమర్థించడం, తగిన మరియు వేలాది మంది RWAలకు ప్రయోజనం చేకూర్చడం మరియు వారి సభ్యుల ప్రయోజనాలను పరిరక్షించడం. వంటి అంశాల ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ సైబరాబాద్-FGCC అసోసియేషన్ సభ్యులతో కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.TSRA-2001 కింద నమోదైన”ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ సైబరాబాద్-FGCC” ఏర్పాటు. దాదాపు 50+ పెద్ద పరిమాణాల గేటెడ్ కమ్యూనిటీలు ఈ ఫెడరేషన్‌లో సభ్యులుగా ఉన్నారు, వీరిలో దాదాపు అందరూ తమ RWAలను TSRA-2001 కింద నమోదు చేసుకున్నారు. అని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (RWAs) యొక్క చట్టపరమైన స్థితిని సమర్థించడం, తగిన మరియు వేలాది మంది RWAలకు ప్రయోజనం చేకూర్చడం మరియు వారి సభ్యుల ప్రయోజనాలను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని PAC చైర్మన్ గాంధీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కావూరి అనిల్ మరియు ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ సైబరాబాద్-FGCC అసోసియేషన్ సభ్యులు సాయిరవిశంకర్ , మాగంటి సత్యనారాయణ, హరిప్రసాద్ రావు, శివ ప్రకాష్ అల్లూరి మరియు తదితరులు పాల్గొన్నారు.
