
తమకు న్యాయం చేయండి అంటున్న ఇస్లాం మహిళ సంగం సభ్యులు రేష్మ బేగం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న స్వయంకృషి ఎస్ ఎల్ ఎఫ్ మెప్మా కల్వకుర్తి పట్టణ మహిళ సమైక్యలో 2021 నుండి 2022లో రేష్మ. రాజేశ్వరి. సరస్వతి.ఫార్మీద. హస్మ వరి కొనుగోలు కేంద్రంలో పనిచేయడం జరిగింది. ఇందుకుగాను వారికి వచ్చే కమిషన్ డబ్బులనురాకుండా కల్వకుర్తి పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు మహమూదా బేగం.కార్యదర్శి జ్యోతి. కోశాధికారి అంజలి. బుక్ కీపర్ సువర్ణ. ధనలక్ష్మి. లు నాగర్ కర్నూల్ మెప్మా డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ శ్వేత అండదండలతో ఇస్లాం మహిళా సంఘం వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తూ అనరాని మాటలు అంటూ వారి మాటల ద్వారా ఆత్మహత్యలు చేసుకునే విధంగాచేస్తున్నారని, కష్టకాలంలో కూడా పనిచేసిన రేష్మ. రాజేశ్వరి. సరస్వతి. ఫైమా.అస్మ.లు వరి కొనుగోలు కేంద్రంలో పని చేయలేదని రికార్డులలో వారి పేర్లు ఉన్న పేజీలను చింపి వేయడంతో తమకు అన్యాయం జరిగిందని కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో మున్సిపల్ ఆఫీస్ లో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశామంటూ, తమకు వచ్చే కమిషన్ డబ్బులు తమకు ఇప్పించాలని వారు మీడియాను కోరడం జరిగింది.జ్యోతి, అంజలి.మహమూద బేగం,ఫేక్ బిల్స్ తయారుచేసి,కల్వకుర్తి మాజీ మున్సిపల్ కమిషనర్ ద్వారా సంతకాలు చేయించుకోవడంతొ ఇస్లాం మహిళా సంఘం సభ్యులం ఈ విషయాన్ని కల్వకుర్తి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, తము పని చేసినట్టు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అంటూ వరి కొనుగోలు కేంద్రంలో తప్పు చేసిన వారు ఎవరైనా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని వారు కోరారు.
