Spread the love

రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

నాదెండ్ల మండలం కనపర్తి వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.