TEJA NEWS

మంత్రిని కలిసిన రోజా – రాజీ ప్రయత్నాలా ?

మాజీ మంత్రి రోజా పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే ఎవరూ ఊహించని విధంగా డిప్యూటీ సీఎంకు ధైర్యం చెబుతూ ఓ ట్వీట్ పెట్టారు. ఇలా ఎలా అని అనుకుంటూ ఉండగానే…. రోజా ఓ మంత్రిని కలిశారన్న ప్రచారం ఊపందుకుంది. రాయలసీమకు చెందిన ఆ మంత్రికి ప్రభుత్వం విజయవాడలో కేటాయించిన ఇంటికే నేరుగా రోజా వచ్చి కలిశారని చెబుతున్నారు.

రెడ్ బుక్ అంశంలో లోకేష్ ఎంత సీరియస్‌గా ఉన్నారో వైసీపీ నేతలకు ఓ క్లారిటీ వస్తోంది. అదే సమయంలో సైలెంటుగా తాము చేసిన అవినీతిపై అన్ని వ్యవహారాలు తవ్వుతున్నారని కూడా వారికి అర్థమవుతోంది. అందుకే రోజా రాయలసీమ మంత్రిని కలిసి రాజీ ప్రయత్నాల దిశగా తొలి అడుగు వేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఆ మంత్రి ఎవరు.. అసలు రోజా కలిసి చేసిన చర్చలేమిటి అన్నదానిపై ఇంకా గాసిప్సే వినిపిస్తున్నాయి కానీ అధికారికంగా భేటీ గురించి బయటకు రావడం లేదు.

రోజా ఇటీవలి కాలంలో తన నోటిని అదుపులో పెట్టుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. కీలకమైన విషయాల్లో ఆమె పొదుపుగా స్పందిస్తున్నారు. మొదట్లో కొంత కాలం సైలెంటుగా ఉన్నా.. మహిళలను చంద్రబాబు అరెస్టు చేయవద్దని చెప్పారని తెలిసిన తర్వాత ఆమె రెచ్చిపోయారు. మళ్లీ స్లో అయ్యారు. ఏం జరుగుతుందన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.