Spread the love

మహబూబాబాద్ జిల్లా..

POCSO బాధితుల ఖాతాల్లో రూ. 20.75 లక్షలు జమ

భరోసా సెంటర్ ను సందర్శించి భరోసా సేవలను సమీక్షించిన జిల్లా ఎస్‌పి సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

మహబూబాబాద్ జిల్లా ఎస్‌పి సుధీర్ రామ్ నాథ్ కేకన్ భరోసా సెంటర్‌ను సందర్శించి, అందిస్తున్న సేవలను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చొరవ తో 2022 నుంచి 2024 వరకు భరోసా కేంద్రం ద్వారా 56 మంది బాధితులకు ప్రభుత్వం తరపున రూ. 20,75,000 (ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు) బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది.

ఈ పరిహారం కేవలం మంజూరైన మొత్తం జిల్లా ఎస్‌పి ప్రత్యేక ఆసక్తితో సంబంధిత అధికారులతో చర్చించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాయిదా పడకుండా వెంటనే విడుదల చేయించబడింది.
ఇట్టి విషయం పై కృషి చేసిన డిఎస్పీ తిరుపతి రావు, రూరల్ సీఐ సరవయ్య ను ప్రత్యేకంగా అభినందించారు

పరిహార పంపిణీ వివరాలు:

FIR దశలో: 50 మంది బాధితులకు రూ. 12,50,000

చార్జీషీట్ దశలో: 23 మంది బాధితులకు రూ. 5,75,000

తీర్పు (జడ్జిమెంట్) దశలో: 5 మంది బాధితులకు రూ. 2,50,000

ఎస్‌పి సూచనలు & సమీక్ష:

  1. బాధితుల ఖాతాల్లోకి పరిహారం వేగంగా జమ చేయడానికి భరోసా యంత్రాంగం మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు.
  2. బాధితులకు మానసిక, లీగల్ కౌన్సెలింగ్‌ను మరింత బలోపేతం చేసి, వారికి తగిన సహాయం అందించాలి.
  3. భరోసా కేంద్రం సేవల గురించి మరింత అవగాహన కల్పించేందుకు స్కూల్స్, కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
  4. మహిళలు, చిన్నారులు వేధింపుల నుంచి రక్షణ పొందేలా పోలీస్, భరోసా సిబ్బంది సమన్వయంతో పని చేయాలి అని అన్నారు.

భరోసా కేంద్రం సేవలపై ఎస్‌పి ప్రశంసలు

జిల్లా ఎస్‌పి భరోసా కేంద్రం బాధితుల కోసం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. బాధితులకు ఎప్పటికప్పుడు సహాయంగా ఉండాలని, వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని సూచించారు.

ఈ సందర్భంగా, భరోసా కేంద్రం ద్వారా పరిహారం పొందిన బాధితులు, ప్రభుత్వం అందిస్తున్న సహాయం గురించి హర్షం వ్యక్తం చేశారు.

భరోసా కేంద్రం మహిళలు, చిన్నారుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన సహాయం పొందేందుకు ప్రజలు దీనిని వినియోగించుకోవాలని ఎస్‌పి గారు సూచించారు.

ఈ కార్యక్రమంలో భరోసా టీం వారు జ్యోష్ణ, జయశ్రీ, పార్వతి, రేణుక, మౌనిక మరియు SB CI చంద్రమౌళి , రూరల్ CI సర్వయ్య , రూరల్ SI దీపికా , షీ టీం SI సునంద మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.