Spread the love

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రూ.79 కోట్ల 58 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నాలల విస్తరణ పనులు

వరద ముంపు సమస్య నుండి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు

నాలల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం

రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

రూ.11 కోట్ల 55 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే (RCC బాక్స్ డ్రైన్ ) వరద నీటి కాలువ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ కాలనీ లో గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు రూ.11 కోట్ల 55 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే (RCC బాక్స్ డ్రైన్ ) వరద నీటి కాలువ నిర్మాణం పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ SNDP ఫేస్ 2 లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల 58 లక్షల రూపాయలతో అంచనా వ్యయం తో నాలల విస్తరణ పనులు చేపట్టడం తో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, దానిలో భాగంగా గఫుర్ నగర్ కాలనీ నుండి దుర్గం చెరువు వరకు రూ.11 కోట్ల 55 లక్షల రూపాయలతో నాల విస్తరణ పనులు మరియు RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులు, RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం మరియు నాల విస్తరణ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ,నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని , ఒక్కప్పుడు వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళన తో ఇబ్బందులకు గురయ్యేవారు అని, కానీ నేడు సమస్య లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగినది అని, ఈ రోజు పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని,నాలల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభించింది అని ప్రజా అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రధాన్యత లో విస్తరణ పనులు చేపట్టాలని ,నాలల విస్తరణ పనులలో వేగం పెంచాలని ,యుద్ధప్రాతిపదికన పనులుప్రారంభించాలని,అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

నాలల విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాలల విస్తరణ పనులు సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, ప్రధాన రహదారుల పై పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని , నాలల నిర్మాణం సమయంలో నీటి ప్రవాహం సాఫీగా సాగేలా లెవల్స్ ను నిర్దారించుకొని పనులు చేపట్టాలని, వర్షాకాలంలోపు పనులు పూర్తయ్యేలా చూడలని , వరద ముంపు మళ్ళీ పునరావృతం కాకుండా నాలల విస్తరణ నిర్మాణం పనులు చేపట్టాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.

నాలల విస్తరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని , పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, నాల విస్తరణ పనులు పై అధికారులకు పలు సలహాలు ,సూచనలు ఇవ్వడం జరిగినది .
ప్రతి వర్షానికి వరద నీరు కాలనీలు ముంచెత్తడం జరుగుతుంది అని, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టడం జరుగుతుంది అని, భవిష్యత్తు లో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాల విస్తరణ పనులు చేపడుతున్నాం అని, నాల విస్తరణ మరియు ,RCC బాక్స్ డ్రైన్ నిర్మాణము వలన ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుంది అని, ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తిచేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
పనుల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని,రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ నిర్మాణ పనులను చేపట్టడం జరిగినది అని, యుద్ధప్రాతిపదికన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుడదని, పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన నాల విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

SNDP ఫేస్ 2 లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంజూరైన నాలల విస్తరణ పనులు

1.గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు రూ. 11 కోట్ల 55 లక్షల రూపాయలతో RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం

2.జనార్దన్ హిల్స్ కాలనీ నుండి యూరో కిడ్స్ స్కూల్ వరకు రూ. 13 కోట్ల 86 లక్షల రూపాయలతో వరద నీటి కాల్వ నిర్మాణం

3.గురునాథం చెరువు నుండి పటేల్ చెరువు వరకు రూ. 6 కోట్ల 80 లక్షల రూపాయలతో RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం

4.పటేల్ చెరువు నుండి గంగారాం చెరువు వరకు రూ. 18 కోట్ల 92 లక్షల రూపాయలతో RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం.

5.నల్లగండ్ల చెరువు నుండి BHEL చౌరస్తా గ్యాస్ గో డౌన్ నాల వరకు రూ.28 కోట్ల 45 లక్షల రూపాయలతో RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం*

నాలల విస్తరణ పై ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని ఏ చిన్న సమస్య ఎదురైన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు అధికారులకు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో SNDP అధికారులు DE రాజు, AE నిఖిల్,మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజు, సీనియర్ నాయకులు ఉట్ల కృష్జ, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, శ్రావణ్ యాదవ్, ఉట్ల దశరథ్, రజినీకాంత్,శ్రీనివాస్, కావూరి అనిల్ , నరేష్, వినయ్ స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*