TEJA NEWS

రుద్రారం గణేష్ దేవాలయం రాజగోపురం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

పటాన్చెరు మండలం. రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో నిర్మిస్తున్న రాజ గోపురం నిర్మాణ పనులను గురువారం ఉదయం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత నిర్మాణదారులను ఆదేశించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.