TEJA NEWS

గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ పనితీరును పవన్ కల్యాణ్ మెరుగుపరిచారు : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • గ్రామాల అభివృద్ధితో దేశముఖచిత్రం మారుతుందన్నదే డిప్యూటీ సీఎం నమ్మకం : ప్రత్తిపాటి
  • కుట్టుపని నేర్చుకొని మిషన్లు పొందిన బీసీ మహిళలు ఆర్థికంగా స్థిరపడాలి : ప్రత్తిపాటి

:గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ పనితీరును పవన్ కల్యాణ్ మెరుగుపరిచారని, , గతంలో ఆ శాఖను నారాలోకేశ్ సమర్థవంతంగా నిర్వహించి జాతీయస్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాదెండ్ల మండలంలోని సాతులూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో వెనుకబడిన వర్గాల మహిళలకు మాజీమంత్రి స్వయంగా కుట్టుమిషన్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, గ్రామస్తులను ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు.