
ప్రభుత్వం.. రాష్ట్ర ఆడబిడ్డల పరువు తీసింది: సబితా
రాష్ట్ర ఆడబిడ్డల పరువును కాంగ్రెస్ ప్రభుత్వం తీసిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వీర వనితలు పుట్టిన నేలపై రాష్ట్ర ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగింది. ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం బాధాకరం. యావత్ మహిళా లోకానికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి’ అని సబిత ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
