TEJA NEWS

వనపర్తి వాసులకు ప్రతిభా పురస్కారాలు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సాహితి కళావేదిక

వనపర్తికి చెందిన ప్రముఖ నవల రచయిత్రి పాల్కంపల్లి శాంతాదేవి,శిల్పి సాహితీవేత్త వ్యాఖ్యాత బైరోజు చంద్ర శేఖర్ లకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు ప్రకటించడం పట్ల సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవల రచయిత్రిగా గత ఆరు దశాబ్దాలకు పైగా శాంతాదేవి పాఠకులను ఆకట్టుకునే రచనలు చేశారని, శిల్పిగా నాలుగు దశాబ్దాలకు పైగా బైరోజు చంద్ర శేఖర్ వందలాది దేవతా విగ్రహాలను రాష్ట్రంలోని పలు దేవాలయాలకు మలిచారని పేర్కొన్నారు.వీరికి పురస్కారాలు ప్రకటించడం అభినందనీయమని సాహితీ వేత్తలు కోట్ల వెంకటేశ్వర రెడ్డి, కందూరు నారాయణ రెడ్డి, జనజ్వాల,సూర చంద్ర శేఖర్, గోపినాథ్,గంధం నాగరాజు,డా. శ్యాం సుందర్ బండారు శ్రీనివాస్ దేశి రాములు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.