Spread the love

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా శిల్ప బృందావనంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం మూడవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సీతరాముల కల్యాణం వేడుకలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం మూడవ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగినది అని,ప్రత్యేక యాగాలు, యజ్ఞాలు, స్వామి వారి కల్యాణం, బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది అని, కన్నుల పండుగగా కల్యాణం జరుపుకోవడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శిల్పాబృందావనం కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.