TEJA NEWS

సంవిధాన్ బచావో బైక్ ర్యాలీ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఆధ్వర్యంలో జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహం నుండి వి.బి.ఆర్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,నియోజకవర్గం ఇంచార్జ్ లు,టీపీసీసీ కార్యదర్శులు, అబ్సర్వర్స్, కోర్డినేటర్స్, డివిజన్,బ్లాక్ అధ్యక్షులు, పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు..

సంవిధాన్ ర్యాలీలో భాగంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి ముందుకు సాగారు..

అనంతరం వి.బి.ఆర్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా ఎఐసిసి సెక్రటరీ విశ్వనాధ్ హాజరయ్యారు..

ఈ సందర్బంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— జై బాపు.. జై భీమ్.. జై సంవిధన్ కార్యక్రమంలో భాగంగా సంవిధాన్ బచావో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యవర్గం సమావేశంలో మైనంపల్లి హన్మంత్ రావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు..

— దేశంలో కుల గణన చేపట్టాలనే రాహుల్ గాంధీ ఆశయ సాధన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండే మొదలైంది అన్నారు..

— మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు..

ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, ఉప్పల్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి, కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి,శోభరాణి , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు భూపతి రెడ్డి, పున్నరెడ్డి కోర్డినేటర్ ఉస్మా షాకీర్, అబ్సర్వర్స్ దుర్గం భాస్కర్, పారిజాత నర్సింహా రెడ్డి,జిల్లా గ్రంధాలయ చైర్మన్, జిల్లా మహిళ అధ్యక్షురాలు ఆర్.లక్ష్మి, బీసీ సెల్ అధ్యక్షులు, ఎస్సి సెల్, ఎస్టి సెల్ డివిజన్ అధ్యక్షులు,బ్లాక్ అధ్యక్షులు, మున్సిపల్,పట్టణ అధ్యక్షులు, మాజీ కార్పొటర్స్, మాజీ సర్పంచ్ లు, యూత్ కాంగ్రెస్ నాయకులు,ఎన్ఎస్యుఐ నాయకులు, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు..