
- వన్యప్రాణుల దాహం తీరుస్తున్న కొనకళ్ళ సత్యనారాయణ
మండు టెండలో గొంతు తడుపుతున్న పక్షి ప్రేమికుడు.. కొనాకళ్ళ సత్యనారాయణ
ప్రత్యేకంగా దాణా, నీటి వసతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ళ సత్య నారాయణ
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు భగ్గుమంటున్నాడు.ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఐదు నిమిషాలు ఎండకెళ్లొస్తే గొంతు ఎండుకుపోతున్నది. పది నిమిషాలకోసారి పెదవులపై, గొంతులో నీటి తడి పడకపోతే కండ్లు తిరిగేలా భానుడు మండుతున్నాడు.అన్ని వసతులు ఉన్న మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పక్షులు, ఇతర జీవజాతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం నీరు కూడా లభించక పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఎండల తీవ్రతతోపాటు నీరు దొరుకక చనిపోతున్న పక్షుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నదని,ఇలాంటి తరుణంలో అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన బీహార్ లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వయిస్తున్న అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ళ సత్యనారాయణ గౌడ్ పక్షి ప్రేమికుడు ఎక్కడ ఉన్న మానవత్వానికి సహాయం ఒక్కటేగా మిగిలేదని వాటికోసం ప్రత్యేకంగా దాణా, నీటి వసతి కల్పిస్తున్నారు. మట్టి, ఇతర పాత్రల్లో వాటి కోసం నీటిని పోస్తున్నారు. దాణా కూడా వేస్తున్నారు. ఎండలు అధికంగా ఉన్నాయి మూగజీవాలకు మన వంతు సహాయం అందించుదమని,ఎండాకాలంలో నీరు ఇంకిపోయి ఉన్నాయని, ఎండల్లో అవి ఆహారము ,నీళ్ల కోసం ఎక్కువ దూరం కూడా ప్రయాణించలేవని, మన వంతు సహాయము అందిద్దామని, ఇప్పటికే రేడియేషన్ వల్ల భూమికి చాలా జీవులు కనుమరుగైపోయినాయని..పక్షులనే ప్రేమించక పోతే ఇంకా ప్రేమను ఎలా పంచుతామని ‘వీలైతే నీళ్లు పోద్దాం.. కుదిరితే దాణా వేద్దాం డూడ్’ అంటూ వారు పిలుపునిస్తున్నారు.
