
ఎస్సీ వర్గీకరణ నిరసన దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయి
నాగర్ కర్నూలు జిల్లా సాక్షిత ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలుగు తల్లి విగ్రహం ముందు ఎమ్మార్పీస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మూడవరోజు పూర్తి చేసుకున్నాయి, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిజెపి పార్టీ నాయకులు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగాల నియామకాల విషయంలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని రిలే నిరాహార దీక్షలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావంగా దీక్షలకు మద్దతు తెలపడం జరిగింది, రాష్ట్ర అసెంబ్లీ లోపల వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టడం జరుగుతుంది,
కచ్చితంగా మాదిగలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని, సూచించారు. అదేవిధంగా బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, పట్టు వీడకుండా విక్రమార్కుడిలా మాదిగ జాతికి మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటం మందకృష్ణ మాదిగది, ఆయన చేస్తున్నటువంటి సేవలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతున్నాం అన్నారు, ఈ నిరసన దీక్షలో బిజెపి పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మార్పీఎస్, తుడుం చంద్ర కిరణ్, మబ్బు సాయిలు, ఎమ్మెస్ ఎఫ్ దేవరాజ్, నాగేష్, దుర్గ ప్రసాద్,
రామ్ భూపాల్ రెడ్డి,
ఆనుగుల జంగయ్య,
సదానందం గౌడ్,
బాలయ్య, విజయ్ కుమార్ గౌడ్,బాబి దేవ్, రాఘవేందర్ గౌడ్,
నరసింహ.. రవి,శేఖర్ రెడ్డి,
ముప్పిడి కృష్ణ, ముకురాల, కృష్ణ మాదిగ,నేరటి మల్లేష్ మాదిగ,విరపాకుల సురేష్
ప్రసాద్, తాడెం చిన్న,
కిషోర్ మాదిగ, రమేష్ మాదగ,
తదితరులు పాల్గొన్నారు.
