Spread the love

సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.

సర్వేలు త్వరగా పూర్తి చేయండి. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకుకు కృషి చేయండి. కమిషనర్ ఎన్.మౌర్య

నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి ఉత్తమ ర్యాంకును సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజల నుండి వచ్చిన పిర్యాదుల పరిష్కారం, స్వచ్ఛ సర్వేక్షన్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు, ఆన్లైన్ ద్వారా సచివాలయ కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సర్వే లను సచివాలయ సిబ్బంది త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రజలకు ఉపయోగకరమైన పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి నగరం ఉత్తమ ర్యాంకును సాధించేలా అందరూ కృషి చేయాలని అన్నారు.

రోడ్ల పైన గుంతలను త్వరగా పూడ్చాలని అన్నారు. నగరంలో గోడలకు పెయింటింగ్, డివైడర్ల మధ్యలో పూల మొక్కలు నాటడం వంటి సుందరీకరణ పనులు గడువులోపు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు, చెత్త లేకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. ప్రతి ఇంటి వద్ద నుండి తడి, పొడి చెత్త వేర్వేరుగా తీసుకెళ్ళే ప్రక్రియను అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలు నగరంలో ఎక్కడ ఉండకుండా తరలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. హోమ్ కంపోస్టింగ్ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. తూకివాకం వద్ద గల చెత్త నిర్వహణ కేంద్రంలో అన్ని ప్లాంట్లు వందశాతం పనిచేసేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపి మహాపాత్ర, ఏసిపి బాలాజి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ నరేంద్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మస్తాన్, డి.ఈ.లు, సూపరింటెండెంట్లు, తదితరులు ఉన్నారు.