
సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయం: నూతన కార్యవర్గం సభ్యులను అభినందించిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో “కుత్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్” నూతన కార్యవర్గం సభ్యులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులకు నా శుభాకాంక్షలు. కుత్బుల్లాపూర్ గ్రామ సమస్యలను తమ సమస్యలుగా భావించి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే సీనియర్ సిటిజన్స్ సభ్యుల సేవలు అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎస్. నరసింహారెడ్డి, సలహాదారులు జి. బలవంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం, కోశాధికారి ఆర్. మురళి గౌడ్, ముఖ్య ఉపాధ్యక్షులు లింగం గౌడ్, ఉపాధ్యక్షులు ఎన్. నాగేష్ కుర్మ, సమీక కార్యదర్శి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మణాచారి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
