
పేకాట స్థావరంలో పోలీసుల దాడులు పట్టుబడ్డ ఏడుగురు వ్యక్తులు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని నాగర్ కర్నూల్ రోడ్ లో అఖిల్ అనే వ్యక్తి ఇంటిలో క్రాంతి అనే వ్యక్తి పేకాట ఆడిపిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది తోటి తనిఖీ చేయగా ఏడుగురు వ్యక్తులు మూడు ముక్కలాట పేకాట ఆడుతూ ఉండగా పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, అందులో 1) అఖిల్ 2)క్రాంతి 3)సత్యం యాదవ్ 4)సంతు యాదవ్ 5)వంశీకృష్ణ 6)బురాన్ 7) ప్రశాంత్ లను అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి 66,700 నగదు మరియు పేక ముక్కలను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు, ఎలాంటి వారైనా ఎంతటి వారైనా పేకాటలు ఆడితే ఉపేక్షించేది లేదంటూ ఎస్సై మాధవరెడ్డి హెచ్చరించారు.
