
చేవెళ్ల నియోజకవర్గం:- శంకర్ పల్లి మండలం మొకిల గ్రామ వాసి బండమీది వెంకటేశ్ మాతృ మూర్తి బండమీది అంతమ్మ ఇటీవల మరణించడం జరిగింది. చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య గారు పట్లోల్ల రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని, అంతమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎమ్మెల్యే తో పాటు మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
