
సృష్టి లయకారుడు శంకరుడు..
ఆ శంకరుడి దీవెనలు ప్రతిఒక్కరి పై ఉండాలి: నీలం మధు ముదిరాజ్..
సంగారెడ్డి ఫసల్వాదిలో జరుగుతున్న కోటి రుద్రాక్ష లింగార్చన కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్న నీలం మధు..

ఆ సృష్టి లయకారుడు శంకరుడు అని, ఆయన దీవెనలతో ప్రతిఒక్కరు ఆయురారోగ్యాలతో జీవించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
మహాశివరాత్రి పురస్కరించుకుని సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఫసల్వాది గ్రామంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి రుద్రాక్షలింగార్చన కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహాశివరాత్రి సందర్భంగా కోటి రుద్రాక్ష లింగార్చన కార్యక్రమాన్ని చేపట్టి భక్తులలో ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా కృషి చేస్తున్న మహేశ్వర సిద్ధాంతి సేవలను కొనియాడారు. అర్ధనారీశ్వరుడు, పరమ శివుడిని కొలిస్తే సకల సమస్యలు పరిష్కరమవుతాయన్నారు. మహాశివరాత్రి పవిత్రమైన పండుగ అని, శివ పార్వతులు వివాహం జరిగిన రోజు అన్నారు. శివరాత్రి సందర్బంగా శివ ఆరాధన చేస్తూ శివ పార్వతుల కల్యాణంలో పాల్గొంటే అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం లభించి కోటి జన్మల పుణ్యం దక్కుతుందని ప్రజలు విశ్వసిస్తారని తెలిపారు,ఈ కార్యక్రమంలో ఉత్సవా నిర్వాహకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.