
తొలి ఏకాదశి పర్వదినం ను పురస్కరించుకొని శంషిగూడ డివిజన్ పరిధిలోని శంషిగూడ లోని నక్షత్రరూప ధర్మ శాస్త్ర దేవస్థానం సముదాయం లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ గారు మాట్లాడుతూ తొలి ఏకాదశిని “దేవశయని ఏకాదశి” అని కూడా అంటారు అని, ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. నుంచి నాలుగు నెలల పాటు “చాతుర్మాస దీక్ష” ప్రారంభమవుతుంది అని, ఉపవాసం, విష్ణు పూజల ద్వారా ఇంద్రియ నిగ్రహం, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తాయి అని, ఆ దేవుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కొరుకుతున్నాను అని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు జోగిపేట భాస్కర్, పోశెట్టిగౌడ్, జోగిపేట బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు