
శేరిలింగంపల్లి నియోజకవర్గ సమస్త ప్రజలకు, కార్పొరేటర్లకు,ప్రజాప్రతినిధులకు,నాయకులకు,కార్యకర్తలకు,కాలనీల అసోసియేషన్ సభ్యులకు, కాలనీల వాసులకు, పాత్రికేయ మిత్రులకు ,ఆత్మీయులకు హొలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ ప్రకృతి అనేక రంగులతో సింగారించుకునే సమయం, అదే వసంతోత్సవం.. హోలీ పర్వదినం అని, హొలీ మన జీవితాలలో ఆనంద పరిమళాలను ,సుఖ, శాంతి సౌభాగ్య విజయాలను నింపాలని మనసారా కోరుకుంటున్నాను అని, హొలీ రంగుల వేదజల్లిక అని, సహజ సిద్ధ రంగుల ను వాడుతూ, అన్ని రకాల జాగ్రతలు పాటిస్తూ పిల్ల పాపాలతో కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషాలతో హొలీ పండుగను జరుపుకోవాలని ప్రజలకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
