
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ
శింగనమల నియోజకవర్గము : గార్లదిన్నె మండలం, మర్తాడు గ్రామస్తులు కూడేరు వద్ద జరిగిన ఆటో-కారు ప్రమాదంలో నలుగురి మృతి చాలా బాధాకరమని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ పేర్కొన్నారు. ఈ ఘటన చాలా తీవ్రంగా కలిచి వేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ఆదుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడుతూ తరచుగా రోడ్డు ప్రమాదాలు జరగడం, క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతుండడం చాలా ఆందోళన కలుగుతుందన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో అతివేగమే కారణమని తెలుస్తుందన్నారు. ఈ విషయం పట్ల ద్విచక్ర వాహనదారుల నుంచి ఆటోలు, ఐచర్ వ్యాన్లు, పెద్ద వాహనాలు, తదితర వాహనాల డ్రైవర్లు ప్రభుత్వం, పోలీసులు పేర్కొన్న సూచనలను పాటించి, ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.
