TEJA NEWS

డిసిఎంఎస్ చైర్మన్ గా శ్యామల కాశిరెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన బైరెడ్డి, దారపనేని

కనిగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అడుగుజాడల్లో పయనిస్తూ, వెలిగండ్ల మండలంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ, తెలుగుదేశం పార్టీ విధేయుడుగా ఉంటూ, ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా మిత్రుడు, మంచికి మారుపేరు అయిన శ్యామల కాశి రెడ్డికి మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో డిసిఎంఎస్ చైర్మన్ పదవి వరించడం శుభ పరిణామం అని కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ పదవి రావటానికి సహకరించిన కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లాలోని శాసన సభ్యులందరికీ బైరెడ్డి, దారపనేని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.