TEJA NEWS

చిరంజీవి నజీర్లను ఎస్ఐ మాధవరెడ్డి అభినందించారు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన సిమ్కో (కంప్యూటర్ ఇన్స్టిట్యూట్) యజమాని అయినటువంటి బల్వంత్ రెడ్డి యొక్క లాప్టాప్ పోగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ చిరంజీవి, నజీర్ లాప్టాప్ ని వెతికి యజమాని అయినటువంటి బల్వంత్ రెడ్డి కి అప్పజెప్పడం జరిగింది. ఇట్టి విషయంలో కల్వకుర్తి ఎస్ఐ మాధవ రెడ్డి, క్రైమ్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్స్ అయినటువంటి చిరంజీవి, నజీర్లను అభినందించారు.