
వాహనం నడుపుతూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం : ఎస్ఐ సాయిరాం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వాహనదారులకు అవగాహన సదస్సు
సూర్యపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలో వాహన దారులకు త్రిబుల్ రైడింగ్ , వాహనం నడుపుతూ సెల్ఫోన్ డ్రైవింగ్ చేయడం ప్రమాదమని ట్రాఫిక్ నిబంధనలు పై సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు నిబంధనలు పాటించాలని అన్నారు. జాతీయ రహదారిపై రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నందున రాంగ్ రూట్ ప్రయాణలు అసలు చేయవద్దని వాహన చోదకులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు జైలు శిక్షలు తప్పవన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు పాల్గొన్నారు .
