
చెన్నకేశవ స్వామి ఆలయానికి వెండి కిరీటాలు బహుకరణ
సూర్యపేట జిల్లా (పిల్లలమర్రి): మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు శుక్రవారం సూర్యాపేటకు చెందిన ఉపేంద్ర భాస్కర్ సౌజన్య నీలిమ దంపతులు 30,000 వేల వ్యయంతో శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణ స్వామి వార్లకు వెండి కిరీటాలు మరియు వెండి యజ్ఞోపవీతమును శుక్రవారం ఆలయంలో అర్చకులు ఛైర్మెన్ సమక్షంలో అందజేశారు.తదుపరి ఉత్సవ మూర్తులకు అలంకరించారు. అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వామ్యం కావటం ఎంతో విశేషం అన్నారు. చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాశస్త్యం సూర్యాపేట చుట్టుపక్కలే కాకుండా సదూర ప్రాంతాలకు తెలియటంతో పిల్లలమర్రి చెన్నకేశవ స్వామి ఆలయానికి భక్తుల రాక పెరిగింది అన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా స్వామి వారు ఇక్కడ ఉత్తర ముఖంగా కొలువుదిరి భక్తుల ఇది బాధలను తీరుస్తున్నారన్నారు.దేవాలయ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
